Telugu Lyrics
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం
శరణం ..........నీ చరణం...........
"ఇదిగో"
పలుమార్లు వైదొలిగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపునకు - తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో - నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా - ఈ నా శేషజీవితం
- 2
నీ పాదములచెంత చేరి - నీ చిత్తంబు నే నెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పని చేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు ప్రియ - సుతునిగా పని చేయనిమ్ము
ప్రతి చోట నీసాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
- 2
విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు - కలకాలం మరి నాకు నొసగు
క్షేమ క్షామ కాలమైన నిన్ను - ఘనపరచ బ్రతుకు నిమ్మయ
నశియించు ఆత్మలన్ నీ - దరి చేర్చ కృపనిమ్మయ
- 2
Song Lyrics in English
Idigo Deva Naa Jeevitham Aapadamasthakam Nee Kankitham
Saranam ..........Nee Charanam...........
"Idigo"
Palumarlu Vaidoliginaanu - Paraloka Darshanamu Nundi
Viluvaina Nee Divya Pilupunaku - Taginattu Jeevinchanaiti
Ayna Nee Prematho - Nannu Daricheerchinaavu
Anduke Gaikonu Deva - Ee Naa Sheshajeevitham
- 2
Nee Paadamulachenta Cheri - Nee Chittambu Neeruga Nerpup
Nee Hridaya Bhaaramu Nosagi - Prarthinchi Pani Cheyanimmu
Aagipoka Saagipovu Priya - Suthuniga Pani Cheyanimmu
Prathi Chota Neesakshiga - Prabhava Nannundanimmu
- 2
Vistara Panta Polamu Nundi - Kasthinchi Pani Cheya Nerpupu
Kannitito Viththu Manasu - Kalakaalam Mari Naaku Nosagu
Kshema Kshama Kaalamaina Ninnu - Ghanaparcha Brathuku Nimmaya
Nashiyinchu Aathmalan Nee - Dari Chercha Krupanimmaya
- 2