Song Lyrics in Telugu
నీ ముఖము మనోహరము
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1.
నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై
నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"
2.
నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"
3.
నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై
నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"
Song Lyrics in English
Nee Mukhamu Manoharamu
Nee Mukhamu Manoharamu - Nee Swaramu Madhuryamu
Nee Paadalu Aparanji Mayamu
Yesayya Naa Praana Priyuda - Managalana Ninu Veedi Kshanamaina
1.
Neeve Naatoduvai Neeve Naa Jeevamai - Naa Hrudilona Nilichina Jnapikavai
Anuvanuvuna Neekrupa Nikshiptamai
Nanu Ennadu Veedani Anubandhamai "Yesayya"
2.
Neeve Naa Shailamai Neeve Naa Shrungamai - Naa Vijayanikai Neevu Bhujabalamai
Anukshanamuna Shatruvuku Pratyakshamai
Nanu Venudiyaneyaka Vennu Tattinavu "Yesayya"
3.
Neeve Veluguvai Neeve Aalayamai - Naa Nityatvamunaku Adyantamai
Amaralokana Shuddhulato Parichyamai
Nanu Maimarachi Nename Chesedano "Yesayya"