Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రక్షణగిరి నిలయా వందనం
కరుణించుమయా కరుణామయా ||2||
దీవించుమయా యేసయ్యా
కురిపించుము నీ వరములు
పాడరా పాటపాడరా వేడరా ఎలుగెత్తిచాటరా
మన మదినేలు మా మంచిగొల్లరా
మన హృదినేలు తిరుహృదయ కొండరా
ఇదియే మన రక్షణగిరి పుణ్యస్ధలిరా పాడరా
1 వ చరణం..
గాలికొండగ నిలిచే గతకాలమందు
పిల్లతిమ్మెరలు వీచే పురవీధులందు
ఆ కొండపురమున కండగ నిలచి
పుణ్యక్షేత్రమై వెలసే
అగ్ర పీఠానికి అందలముగా పాడరా
2 వ చరణం..
కొండ కీవల నిలచే ప్రజ యుద్ధసభగా
కొండ కావల వెలసే జయ విజయ సభగా
ఆ కొండ ఇరు సభలండగ నిలచే
ధస్యస్ధలియై వెలసే
జ్ఞానపీఠానికే వందనముగా పాడరా