Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా. యూదయా సీమ యందలి బెత్లెహేమా
నీవు ఎంతమాత్రము అల్పమైనదానవు కావు
ఏలయన నీ నుండి రక్షకుడు ఉదయించెను
ప: రాజులకు రాజు ఉదయించె నేడు
రారండి పోదాము బెత్లెహేముకు ||2||
పాపపు చీకటి తొలగించగా
పశుల పాకలో పవళించగా ||2||
ఈ భువిలో ప్రేమ పంచగా ||2||
1. మానవ లోకము వెలుగొందెనే
జీవము ఇలలో ఉప్పొంగనే ||2||
గ్లోరియా పాడిరి దూతలెల్లరూ...ఓ.. ||2||
గొల్లలు చేరిరి బాలయేసుని
కానుకలర్పించి ముద్దాడినారే ||2|| ||రా||
2. కాంతి రూపుడు ప్రభవించెనే
శాంతి రేఖలు వ్యాపించెనే ||2||
తూర్పున జ్ఞానులు దర్శించినారే... ఓ.. ||2||
బంగారు సాంబ్రాణి పరిమళము,
అర్పించి ఆరాధన చేసినారే ||2|| ||రా||
3. బోసినవ్వుల బాలయేసుకు
లాలిపాటలు పాడంగను ||2||
ఉయ్యాల ఊపుటకు
పోదాము మనమూ......... ||2||