Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రారండి జనులారా రారండి
ఈ వింత కన రారండి ll2ll
1 వ చరణం..
నడి రేయి జాము నందె గొడవేమి పోకముందే
గడుసైన సూర్యుని వోలె మన స్వామి బాలాజేసు ll2ll
పుట్టినాడు ఈరోజు - పుణ్య మోక్ష రాజు ll3ll
2 వ చరణం..
నగుమోము నవ్వు చుండ జగమందు కాంతి నిండ
తెల్ల తెల్లవారే నంచు నిలువెల్ల వింతనొందె ll2ll
సృష్టి యాత్మ సాంతంబు పుట్టెనంచు పుణ్యంబు ll2ll