Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం -11
సాకీ : రావయ్యా యేసుస్వామి - వేచి యున్నాము నీకోసం
రావయ్యా యేసు స్వామి వేచియున్నాము-
నీవే మాకు శరణమని నమ్ముచున్నాము ||2||
1. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము-
నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా
కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము-
కాలిపోక కమలకుండా కాయుము రాజా
శరణం దేవా మాకు శరణం నీవే -
శరణం దేవా మాకు శరణం నీవే ||3|| ||రా||
2. విరిగిన వీణ రాగం పలుకునా -
నలిగిన హృదయంలో శాంతి దొరుకునా
రాగం భావం శృతి లేని నా జీవితం-
ఎలా పాడును యేసు నీ మధుర గానం ||2||
శరణం దేవా మాకు శరణం నీవే ||3|| ||రా||
3. ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా -
సౌఖ్యం లేని దేహం నిన్ను సేవించునా
నీవు ఆరోగ్యం అనురాగం యివ్వని యెడల -
ఎలా ప్రేమింతు నిన్ను ఎలా సేవింతు
శరణం దేవా మాకు శరణం నీవే ||3|| ||రా||