Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. రాత్రి రాత్రి నిశ్శబ్ద రాత్రి రాజాధి
రాజు జనియించిన రాత్రి
రాత్రి రాత్రి పవిత్ర రాత్రి లోకరక్షకుడు
భువి కరుదెంచిన రాత్రి
రాత్రి రాత్రి పరమును
భువియును కలసిన రాత్రి
మహోన్నత దేవునికి మహిమ
దివిలో మంచి మనుషులందరికి శాంతి - భువిలో
1. దూతగణములు ఏతెంచిన శుభవేళ
స్తుతులతో నిండిన రాత్రి ||2||
భూతలమందున మంచి గొల్లలకు
పరమానందమైనట్టి రాత్రి
జో లాలి జో జో లాలిజో ||రా||
2. మరియాంబ కన్యక తల్లి అయిన
సమయంబున అదృష్టమైనట్టి రాత్రి
సకల జాతుల కెల్ల రక్షణమై
మోక్షము తెరచిన రాత్రి
జో లాలి జో - జో లాలి జో ||రా||
3. గాఢాంధకారములో నున్న ప్రజలంత
వెలుగును చూసిన రాత్రి
గగనాన తారెంతో కాంతినిచ్చి
జ్ఞానులకు అండైన రాత్రి
జో లాలి జో - జో లాలి జో ||రా||