Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సజీవ దేవుని వాక్యము వినరే జనులారా
అనంత దేవుని సత్యము కనరే ప్రజలరా ||2||
పరవసించు హృదయం - నేడు పల్లవించిచూడు
పావన దేవుని వాక్యము - ఆలకించగా ||2|| llసజీవll
1 వ చరణం..
ఎండిన ఎడారులలో - జీవ ఊటయిదియే
మండుతున్న గుండెలలో - మంచు జల్లు యిదియే ||2||
తానే జీవమని తానే సత్యమని - పలికినట్టి ప్రభుllసజీవll
2. ఒకే మాటలో కడలిని శాసించిన వాక్యం
ఒకే మాటలో కరుణను కురిపించిన వాక్యం ||2||
తానే సత్యమని - తానే నిత్యమని ||2||
పలికినట్లు ప్రభుని llసజీవll