Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| సకల జనులారా - ఆనంద నాదముతో
ప్రభుని స్తుతింపుడు- ||4||
1. కీర్తనలు పాడి ఆయన నామము
నిత్యము మహిమ పరచుదము
లోకములోని ప్రజలెల్లరును
ప్రభుని కీర్తించి స్తుతింతురు ||2||
ఆయన అద్భుత కార్యములన్నీ
స్తుతిగీతములతో వందింతుము ||2|| ||సకల||
2. మా శత్రువులు తమ రధములను
మా మీద తోలునట్లు చేసితివి ||2||
నీ కృపతో మము కాపాడితివి
నీ మందిరమున బలులిచ్చెద ||2||
దహించిన పొట్టేళ్ళ సుగంధములను
కోడెలు మేకలు బలి ఇత్తును ||సకల||