Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. సర్వోన్నత దేవునకు మహిమ కలుగుగాక
భూలోక ప్రజలకు శాంతి సమాధానం ||2||
1. మహిమాన్వితుడైన మహారాజా
శక్తిమంతుడైన పరమపితా
మిమ్ముస్తుతించుచున్నాము
స్తుతులను అర్పించుచున్నాము ||2||
2. జనితైకసుతుడా ఏలినవారా .
దేవుని గొఱ్ఱపిల్లా భూపాలకా
దైవపుత్రుడా శ్రీ యేసువా
మిమ్ము ఆరాధించుచున్నాము ||2||
3. పితయొక్క ప్రక్కన కూర్చొని యుండి
పరిపాలించెడి మాప్రభువా
ఉన్నతుడా మహోన్నతుడా
మిమ్ము పొగడుచున్నాము ||2||
4. ఇహమున పరమున ఏలేటి క్రీస్తా
పిత సర్వేశ్వరుని దివ్యమహిమలో
పవిత్రాత్మతో నుండువారా .. స
దాకాలం స్తుతియించెదం ||2||
ఆమెన్..... ఆమెన్.....