Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి :
సకల జీవ ప్రదాయిని దివ్య బలిపూజ
దివ్య బలిపూజ దివ్యబలిపూజ -
సాత్విక భావనతో పూజింపరారండి
ప్రణుతింప రారండి -
జనమా ప్రియజనమా దైవ జనమా
పనిసగమపనిస - సనిపమగసనిప
నీసా సగాగాగాగా సాగా గమామామామా
గామా మపాపాపా పనీనీనీని సా
పల్లవి
పూజాబలివేళ రారాజును సేవింప ||2||
రండి రండి రారండి రండి
ప్రణుతించరండి - వడిగా ||2||
ఆ..ఆ..ఆ..ఆ... .
1 వ చరణం..
తోడునీడగా నిలచికాచిన స్వామి సేవ మధురం
తన్మయత్వమే భక్తిభావమని-పరవశించు నిరతం ||2||
సేవలోని ఫలమే పూజకు పరమార్థం ||2|| ||రండి||
ఆ..ఆ..ఆ..ఆ...
2 వ చరణం..
దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్ని పదిలం
తోటి వారిపై ప్రేమ చూపిన - పూజకు సాఫల్యం
త్యాగమయుని బలియే ముక్తికి సోపానం ||రండి||