Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శాశ్వతమైనది ` నీవు నా యెడ ` చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె ` కాచిన కృప ||2|| llశాశ్వll
1 వ చరణం..
నీకు బహుదూరమైన నన్ను ` చేర దీసిన నా తండ్రివి ||2||
నిత్య సుఖ శాంతియే నాకు ` నీదు కౌగిలిలో ||2|| llశాశ్వll
2 వ చరణం..
తల్లి తన బిడ్డను మరచినా ` నీవు మరువలేనంటివి ||2||
నీదు ముఖకాంతియే ` నన్ను ఆదరించెనులే ||2|| llశాశ్వll
3 వ చరణం..
పర్వతము తొలగినను ` మెట్టు దద్దరిల్లినా ||2||
నా కృపా నిను వీడదని ` అభయ మిచ్చితివి ||2|| llశాశ్వll