Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
శాశ్వత ప్రేమతో నను ప్రేమించావయ్యా
కృపచేతనే నన్ను రక్షించావయ్యా
నీ ప్రేమ గొప్పది ` నీ జాతి గొప్పది
నీ కృప గొప్పది ` నీ దయ గొప్పది
1 వ చరణం..
అనాధులైన నన్ను ` వెదకి వచ్చితివి
ప్రేమ జూపి కౌగలించి ` కాచుకొంటివి ||2|| llనీ ప్రేమll
2 వ చరణం..
అస్థిరమైన లోకములో ` తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్యా ` చేర్చుకొంటివి ||2|| llనీ ప్రేమll
3 వ చరణం..
తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటిని
తల్లిలా ఆదరించి ` నడిపించితివి ||2|| llనీ ప్రేమll
4 వ చరణం..
నడుచుచున్న మార్గమంతా యోచించగా
కన్నీళ్ళతో స్తుతించి ` స్తోత్రింతునయ్యా ||2|| llనీ ప్రేమll