Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. సమర్పణం ప్రేమా సమర్పణం
హృదయ పూర్వక ప్రియార్పణం ||2||
స్తుతులర్పణం ఘన స్తుతులర్పణం ||2||
నలిగిన మానస స్నేహార్పణం ||2||
1. గాలినీరు అగ్ని ఆకాశం
భూమి నొసగి దీవించిన యేసుకు
జాలి దీవెన ప్రేమ త్యాగం
మైత్రితో మురిపించిన క్రీస్తుకు
కరుణ ధన్యత కనికరములు చూపు
మరణ మొందిన శ్రీ-అరుణ తేజమై
ఆ దివినుండి అమృతం చిందే శ్రీనాధుడు ||2||
2. పాపము శాపము భారము నేరము
శిలువలో మోసిన జయ క్రీస్తుకి
వేదన శోధన బాధలు వ్యధలు
మాపిన పరిశుద్ద ప్రభు యేసుకు
మనుష్య కుమారుడై యెన్నైన నా కొరకు
దివి నుండి దిగివచ్చిన నాధకు
రక్షణ ఒసగి మోక్షము నిచ్చు
అక్షయ ప్రేమకై విజయేసు