Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. సర్వం నీ దానమేగా దేవా నా ప్రియ నాధా
నాకున్న దేదైనా నీకంకితం
నాదు జీవం నాదు సకలం ఇదిగో
దేవా స్వీకరించు నన్నే స్వీకరించు
1. ఎంత దూరం పోయిన
ఎంతో కాలం గడిచిన
నేను పొందే మేలులు
నీదు దానం మాత్రమే
దేవా నా సర్వం నీవేకదా
2. ఎన్ని ఫలములు తెచ్చినా
నాదు బ్రతుకే ఇచ్చినా
ఓ దేవా నీవేలె స్వీకరించుమా ||2||
నేను పొందే మేలులు
నీదు దానం మాత్రమే
దేవా నా సర్వం నీవే కదా