Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సంధ్యా సుమ మాలలతో స్వాగత గీతాలతో
సుమధుర భావాలతో సుస్వర గానాలతో
అరుదెంచుడీ జనమా - అమరేశుని పూజకు
1. మనలోని ప్రతి అణువు ఎరిగిన ప్రభుని
మాంసపు ముద్దగా చూచిన విభుని
ప్రేమతో మనలను ఆశీర్వదించుమని
ముదముతో మనసారా ప్రార్థించుదాం
2. పుడమిలోని ప్రతి ప్రాణిని పరికించు దేవుని
ఆలనతో లాలనతో పాలించు ఘనుని -
కిలకిల రవళితో కరతాళములతో
నుతియించుదాం... స్తుతియించుదాం... పూజించుదాం!