Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: హృదయారాధన-2
ప: సన్నిధి చేరి ఆరాధించగా
సాయము కోరి ప్రార్థించగా
నా స్వామి నను కరుణించేనుగా
కునుకకా నిద్రపోక నన్ను కాచేనుగ ||2|| ||స||
1. పగటి సూర్యునివలను హాని కలుగదు
రేయి చంద్రుని వలన కీడుగలగదు ||2||
ప్రభువా నా ప్రక్కనుండి నన్ను కాపాడుము
నిత్యం నా నీడయి
ఉండి నన్ను రక్షించుము ||2|| ||స||
2. సంధించు ఆయుధము ఏడి అయినను
నాకు విరోధముగా నిలువ జాలదు ||2||
భూమి ఆకాశమును సృజించిన దేవుడు
అన్ని వేళల యందు నన్ను కాపాడును ||2|| ||స||