Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శాంతమగు రాత్రి ప్రశాంతమగు రాత్రి
అంతా ప్రశాంతము కాంతిమయం
అంతా కాంతిమయం కాంతిమయం
కన్యమేరీ తనయుని చుట్టూ
అంతా కాంతిమయం
దైవ బాలుడు సుకుమార శిశువు
శాంతితో నిదురించే దివ్యరాత్రి ||శాంత||
1. ప్రశాంతమగు రాత్రి
ఇది పవిత్రమగు రాత్రి
గొల్లలు చెంతను నిలుచుండె ||2||
స్వర్గలోక స్తుతులే వినిపించే
దూరము నుండి మధురముగా
గ్లోరియ పాడిరి దూతలంతా
క్రీస్తు రక్షకుడు ఉదయించే
నేడు రక్షణ మాకు వచ్చే ||శాంత||
2. ప్రశాంతమగు రాత్రి-ఇది పవిత్రమగు
రాత్రి ప్రేమను ఒలికే వదనముతో ||2||
ఏసుని జన్మమే మాకు వరం
కాంతి పుంజము వెలువడను
పితయైన దేవుని కృపవలన
దైవ తనయుని జననంబు
విమోచన భాగ్యము-లభియించు ||శాంత||