Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శరణంబీయగ రా రావ - మము కరుణతో చూడగ రారావ
నీ దరికిన్ చేర్చగ రారావ - నీ పరము చేర్చుము మా దేవా
1. తండ్రియని మిము పిలిచితిని -
తల్లియని మిము కొలిచితిని||2||
నీ సేవలకై మిగిలితిని||2||
నీ స్నేహము చేయగ తలచితిని||2|| ||శరణ|| |
2. గానము నీకై పాడితిని -
ధ్యానము నీకై చేసితిని||2||
జీవము కొరకై తపసితిని||2||
నీ జీవము నింపగ రారావా ||శరణ|| |
3. పూజలు చేయుట సల్పితిని -
ప్రార్థన కొరకై వచ్చితిని
పరి పరి విధముల ప్రణతులు చేసి||2||
ప్రార్థించెదము నిన్నెపుడు||2|| ||శరణ|| |