Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. శిథిలమైన జీవిని నేను
ఆరిపోయిన ప్రమిదను నేను ||2||
నీ ప్రేమ కిరణాలు నాపైన
ప్రసరింప చేయుమా నీ ప్రేమ జ్యోతిని
నా హృదిలో వినిపించ రావా
దేవా......ఆ....ఆ.....ఆ.... ..
1. కలుషితమైన బ్రతుకులను
కల్మషరహితంగా మార్చావు ||2||
ద్వేషించు వారిని ప్రేమించావు
దూషించు వారికై ప్రార్ధించావు ||2|| ||దే||
2. అంధకారపు జీవితాలను
ఆనందము చేసావు ||2||
శోకించు వారిని ఓదార్చావు
పాపులకొరకై చేసావు ||2||
శోకించు వారిని ఓదార్చావు
పాపులకొరకై బలియైనావు ||దే||