Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నీ తోడుగా
సాగమ పామగ మగరి గారిస సనిదనిసా
ప. సంతోషముతో సకలము నీకే
సమర్పింతు దేవా గైకొనరావా
ఆదరించి ఆశీర్వదించి...
ప్రీతితో మమ్ములను దీవించు దేవా
గమప గమగమ గమప
పదని పనిపమ నిపసా
1. ఆబేలు కానుక నీకెంత మధురమాయె
అబ్రహాము కానుక నీ కెంత ఘనమాయె
పేదరాలి కానుక..... బహుప్రీతి కరమాయె
నా దీన కానుక... మన్నించు దేవా
గమప గమ గమ గమప
పదని పనిపమ నిపస ||స||
2. నీవు చేసిన మేలులు తలచి
కృతజ్ఞత నిండిన భావము కలిగి
అప్పరసములు ఆశగా తెచ్చితి
మార్చుము నీ సుతుని శరీర రక్తముగా ||స||