Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సరికొత్త పాట నా నోట పలికింది
నా ప్రభు సందేశమై
సరిక్రొత్త వెలుగు నా యెదలో వెలిగింది
నా ప్రభు నందేకమై ||2||
అనురాగమే రాగమై
ఆనందమే పల్లవై ||2||
ప్రభుతోటి అడుగుల సవ్వడి
నా హృదిలో మ్రోగెను తాళమై ||2||
హల్లేలూయా...హల్లేలూయా....
హల్లేలూయా...హల్లేలూయా... ||2||
1. దావీదు గీతాల భావామృతం -
సల్మోను జ్ఞానాన జ్ఞానామృతం ||2||
కల్వరి గిరిపై ప్రేమామృతం ||2||
పరలోక దూతల గానాల శృతిలో ||2||
హల్లేలూయా...హల్లేలూయా....
హల్లేలూయా...హల్లేలూయా... ||2||
||సరిక్రొత్త||
2. జీవింపనెంచిన వాక్యానుసారం
తొలగించెనెంతయ జీవితభారం ||2||
పులకించి పాడెద నీ వేదసారం ||2||
ఉప్పొంగి పొర్లెను-నా హృదిలయలో ||2||
హల్లేలూయా...హల్లేలూయా....
హల్లేలూయా...హల్లేలూయా... ||2|| ||సరిక్రొత్త||