Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శరీరక వాంఛలు మరణమునూ
ఆత్మైక వాంఛలు జీవమును ఇచ్చును
ఆత్మలో అభిషేకం పొందిన అమ్మా ||2||
నే కూడ ఆత్మలో జీవింప ప్రార్ధించు ||2||
అమ్మా మరియా వందనం
అభిషేక మాతా వందనం ||2||
పరలోక రాజ్జీవందనం
పరిశుద్ధ తల్లీ వందనం ||2|| ||శరీరక||
1. గర్భమైనా - కలవరపడలేదు
కలవరపడినా ఎలిజబేతమ్మకు
చేదోడు వాదోడుగా నిలబడితివమ్మా
హృదిలో అభిషేకం జీవితంలో ఆశీర్వాదం ||2||
అమ్మా నీవలే-అభిషేకం పొందాలి ||2||
అందరికీ దీవెనగా నేమారాలి ||2||
||అమ్మా మరియా వందనం|| ||శరీరక||
2. సిలువను చూచీ పారిపోకుండా
సిలువను మోసిన యేసుతో నడచి
బాధలలో నన్ను బలపరచితివి
హృదయం నలిగిన ప్రేమ రక్షించును ||2||
అందరితో నిలబడు హృదయం పొంద ||2||
ప్రార్ధించు అమ్మా-బలపరచు నన్ను ||2||
||అమ్మా మరియా వందనం|| ||శరీరక||