Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి :సర్వలోకాల అధిపతి - పరలోక తండ్రీ...
నమస్తే సర్వలోక జనుల రక్షణ కర్త -
కన్యమరియసుతుడా పరిశుద్ధాత్మ దేవ...
ఆదరణ కర్త - త్రియేక దేవ...
నమస్తే... నమస్తే... నమస్తే... నమోనమ:
పల్లవి:
పూజలు చేయ దేవుని జనమా -
పూమాలలతో పరుగునరండి
పావన యేసుని వాగ్ధానముల-
ఫలమును పొంద వేగమే రండి ||2||
దనినిస... ||3||
1 వ చరణం..
ఆది దేవుని - అభిషిక్తుడు - మానవాళికి
రక్షణ మూర్తి సిలువ బలియను యాగమున-
పండిరచును నవజీవం దనినిస... ||3||
2 వ చరణం..
జీవ మొసగు పరమాత్మునికి-
హృదయ దీపిక వెలిగించుదము ||2||
కరుణతోడ జీవము నీయగ -
వేడుదమా పరిశుద్ధుని ||2||