Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -9
సాకి: సర్వశక్తివంతుడైన ఓ సర్వేశ్వరా!
సదా నీ మహిమను ఘనముగా కీర్తింతును... కీర్తింతును...
కలకాలము నీ నామమును ప్రస్తుతింతును...ప్రస్తుతింతును..
నా బ్రతుకులో నిన్ను మరువక కొనియాడెదను
సర్వసృష్టికి జన్మనిచ్చిన - శక్తివంతుడు తండ్రి దేవుడు ||2||
మానవాళికి రూపునిచ్చిన - జీవపూర్ణుడు సృజనరూపుడు ||2||
పరిశుద్ధ దేవునికి - ప్రణతులు చేయ వేగమెరండి దైవజనమా! ||2||
1) పూజ్యనీయుడు ఆత్మరూపుడు - పుడమి అంతట కీర్తనీయుడు |2||
తన కుమారుడు యేసుక్రీస్తును - ఆత్మబలముతో ఇలకుపంపెను
తండ్రి ప్రేమను దైవపుత్రుడు - దివ్యపూజలో మహిమపరచెను తనాననాన నాన ||2||
తనననా ||3|| ||పరిశుద్ద॥
2) సత్యదేవుని శాంతమూర్తిని - సర్వవేళలా స్మరణచేయుము ||2||
లోకజ్యోతిని నీతిమంతుని - నిండు మనసుతో ప్రార్థింతును
దైవ జనులను దీవింపను - ప్రేమమీరగా పూజింతును ||పరిశుద్ధ||