Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శతవసంతములు నిండినవేళ
పొంగెను మాలో ఆనందహేళ
ఇన్నినాళ్ళు మమ్ము కాచిన తండ్రీ ||2||
అందుకో మా వందనములను ||2||
||శత||
1. సేవా భావమే క్రైస్తవ ధర్మం
సేవా పధమే ముక్తికి మార్గం
నీ పద సేవకు పిలుపందించి
దండిగ మమ్ములను దీవించినావు ||శత||
2. విద్యాబుద్ధులు గరపిన గాని
రోగులు సేవలో మునిగిన గాని
సువర్తా బోధలు చేసినగాని
నీ కృపయే ప్రభు నీ కృపయే ||శత||
3. మానవ కోటికి సేవలు చేసిన
మా ప్రభు యేసు నడచిన బాటలో
నడిపించు మయా ఇకపై తండ్రీ
మా కృషి అంతా సఫలము కాగా ||శత||