Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సెలయేరులా ప్రవహించును
నవజీవమొసగు సంజీవ వాక్యం ||2||
హృదయాలను సృశియించును
కారుణ్యవాహిని నీ దివ్యవాక్యం ||2||
ముదమార యెదలో ధ్యానింతును ||2||
||సెలయేరులా||
1. నీ ఆజ్ఞలనిన నాకెంతో ప్రియము
సుజ్ఞానమందే జీవింతును ||2||
భువిలో యెదలో అనుదినము -
నీ బోధలు ఆలింతును ||2||
మనసారా మదిలో కీర్తింతును ||2||
||సెలయేరులా||
2. నీ ధర్మశాస్త్రము వివరింతును
నా పూర్ణహృదితో పాటింతును ||2||
ధరలో మదిలో అనుక్షణము
నీ విజ్ఞత ధ్యానింతును ||2||
ప్రియమార మదిలో కీర్తింతును ||2||
||సెలయేరులా||