Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శక్తిమంతుడా - సర్వోన్నతుడా
నీ ఆలయమనిన నాకు మిగులప్రీతి ||2||
1. నీ కోవెల లోగిలలో స్థిరవాసం చేయాలని
నీ దీవెన పొందాలని నా కోరిక
నా ఆశ్రయమా - నా రక్షణమా
నీ కృపలో నను నిలుపుట నాకు మేలు ||శక్తిమంతుడా||
2. నీ ఆలయ ద్వారమునకు
కావలిగా ఉండాలని
నీ కృపను పొందాలని నా కోరిక
మహనీయుడా మహిమాన్వితుడా
నీ నీడలో నను నిలుపుట నాకు మేలు ||శక్తిమంతుడా||