Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. శిరమును వంచుడి వినయము తోడ
ఈ మహ యద్భుత వరవాహినికి ||శిరమును ||
1. నూతన ఆరాధన ప్రజ్వలింప
గుప్తము నందు పాత ఒప్పందము
పంచేంద్రియములు గ్రహించగల్గునా
విశ్వాసమేగా - దైవరహస్యం ||4|| ||శిరమును ||
2. పరమపితా మాపాలక జయము
జయము రక్షకా యేసువునకు
పరమ పవిత్ర స్పిరితు సాంక్టుకు
యుగ యుగములకు స్తుతి కల్గుతన్ ||శిరమును ||
గురువు : పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితిరి
ప్రజలు: ఇందులో మాధుర్యము నిండియున్నది.
ప్రార్ధించుదము: ఓ సర్వేశ్వరా! ఈ యద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే! మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మా రక్షణ ఫలిత ములను మేము నిరంతరము చవిచూడను యుగయుగములు జీవించుచూ పాలనచేయు ఏలినవారా మాకనుగ్రహించండి ఆమెన్.