Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్రీ యేసుని స్తోత్రగానము చేయుమా
సుందర సువార్త గీతము పాడుమా
యేసు నాధుని నమ్ముకొని జీవించుమా
జీవితములో ` నీవు జీవము నొందుమా llశ్రీయేసునుll
1 వ చరణం..
క్రీస్తు యేసు సమస్త పాపము బాపగా
శిలువ బాధను అనుభవించెను ఊర్మితో
రక్షణను కలిగించె సర్వజనావళికి
మోక్ష రాజ్యపు ` దివ్య మార్గము చూపెనూ.... llశ్రీయేసునిll
2 వ చరణం..
యుగయుగాలుగ జగతిలో జనులెందరో
రక్షణను ` సాధించలేక గతించిరి .... llయుగయుగాll
బలముచే ` నీవు పాపము నుండి విడుదల నొందుమా.... !
llశ్రీయేసునిll