Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శౌరివారి సేవింతుము కోరిక మీరా
ధరణిలో భక్తుల దరిజేర్చుమని
పరిపరి విధముల ప్రస్తుతి జేసి
1. అరుదైన నీతి మదిలో దలచి స్థిరమైన ముక్తి
కిరువైన మార్గామేమని దలచి పరమగురుండే పావని
దలచుచు గరము సుభక్తితో గోనియాడుచుమది...||శౌరి|| ...
2. దాసుల నెల్ల జేరదీసి లోకధారుడు
జేసెనను బోధజేసి
బాసురముగ మోక్ష పదవి జేరగ
జేయుచు రక్షకు చెంతకు జేర్చగ ||శౌరి|| ...
3. పరుల కుపకారము జేయదలచి తన బుద్ది భక్తి
పరులకు వశముకాగ జేసి
నిరతము దేవుని నామము నెమ్మది
పొరలెడు భక్తితో బల్కగ నేర్చిన ...||శౌరి|| ...
3. చాల దీనుల మేలు గనుచు మత్వరిలో నున్నవి
శాలాగారము నేలుకోనుచు
వాలయముగను వచ్చిన సజ్జన
జారమును కృప నేలుచునుండెడు ...||శౌరి|| ...
4. భారత దేశమున కపోస్తాలుగా నేతెంచి
జనుల యందు సత్కరణ మిగుల మీర
పొందగ సత్యము బోధించిన శ్రీ
వందిత పావన సుందర వరగుణ...||శౌరి|| ...