Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్రీ రక్షకుని సిలువ... స్వర్గ సీమకు
ద్రోవ మానవాళిని గావ.... మహనీయమౌ నావ
జయశీలడౌ దేవ స్తుతి జేతుము గావ
ఓ సిలువ నా సిలువా
జోహారు జయసిలువ llశ్రీ రక్షll
1 వ చరణం..
కనికరంబున జూచి కరుణతో మమ్మేలి
ఆశీస్సులను గురిచి యమిత వరముల నొసగి
దివ్య వదనము దీప్తి తేజస్సు
మా కొసగి దేవ పీఠమునుండి
దీవించు మము గాచి llశ్రీ రక్షll
2 వ చరణం..
ఓ వెఱ్ఱి ప్రజలరా ఓ మూర్ఖజనులారా
ఎట్టి బాధలు మీకు నేను కలిగించేను
చేయవలసినదేమి చెప్పగలరా
మీరు నా సర్వమిచ్చితిని
నా ప్రాణ మొడ్డితిని llశ్రీ రక్షll
3 వ చరణం..
ఈపిప్తు దాస్యంబు నెడబాపినందుకా
సిలువపై మరణంబు సిద్ధపరచిరి
నాకు దరిలేని శ్రమలిచ్చి ధరనాధు
దండిరచి కొని తెచ్చి నందుకా
కొరడ వ్రేటులు నాకు llశ్రీ రక్షll
4 వ చరణం..
రాయలను భజించి రత్నాకరుని జీల్చి
అరిసైన్యము జంపి అద్ధరికి మిమ్ము జేర్చి
రక్షించినందుకా రచ్చకీడ్చిరి నన్ను
శిక్షలకు గురిచేసి సిలువ నిచ్చిరి నాకు llశ్రీ రక్షll
5వ చరణం..
మేఘస్తంభమునగుచు మిము
వనముకు నడిపి నలుబదేడులు
మీకు అ స్వర్గ భృతినిచ్చి సిరలు
వరలెడినేల జేర్చి నందుకు
మిమ్ము సిలువపై
నా రక్త సిరల దొలచిరి మీరు llశ్రీ రక్షll
6వ చరణం..
మన్న భోజన మిచ్చి మరల బెంచితి
మిమ్ము చెంప పెట్టుల తోడ శిక్షించితిరి
నన్ను స్వచ్ఛ జలముల యూట నిచ్చి
దేర్చితి మిమ్ము చేదు గలిపిన
విషము చేతికిచ్చిరి నాకు llశ్రీ రక్షll
7వ చరణం..
కానరాజుల నెల్ల కడదేర్చితిని
మీకై ముండ్లమకుటము నిచ్చి
మన్నించితిరి నన్ను
రాజు వంశీకులుగ రాణ గూర్చితి మీకు
పరిహాసరాజుగా పరిహసించిర నన్ను llశ్రీ రక్షll