Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయు
పౌలువలేను సీలా వలెను
సిద్దపడిన భక్తుల చూచి
1. కొండలాంటి బండలాంటి -
మొండి హృదయం మండించుచు
పండియున్న పాపులనైన -
పిలుచుచుండె పరము చేర
2. వంద గొట్టెల మందలో నుండి
ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబది తొమ్మిది గొట్టెలనిడచి -
ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్ ||శిలువ||
3. తప్పిపోయిన కుమారుండు -
తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగి రాగా -
తండ్రి యతని చేర్చుకొనెను ||శిలువ||
4. పాపిరావా పాపము విడచి -
పరిశుద్దుల విందులో చేరా
పాపుల గతిని పరికించితివా -
పాతాళంబే వారియంతము ||శిలువ||