Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్రీజేసు జయంతి నేడే కదా -
శ్రీకరుని సేవింతం రారండోయి ||3||
శ్రితజన మందారున్ పూజింతుము
1. ఈ భువి కేతెంచిన భవ్య సుతున్ -
పావన పిత సుతుని రూప మందు ||3||
ప్రేమించి పూజింప రారండోయి
2. ఆదాము అఘమును అంతం చేయన్ -
దేవుండే మానవుడై అవతరించెన్ ||3||
అర్పింతుం వారికి భక్యంజలి
3. భరత జనయిత్రి తనయులారా -
ఆంధ్రావని ప్రియతమ సోదరులారా
శ్రీజేసు సందేశం వినరండోయి