Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. శ్రీ క్రీస్తు శరీరము దివ్యాహారము
నా యేసు రక్తము-పరమ
పానము-పరమ పానము
1. పరమున నుండి దిగివచ్చిన
దివ్యాహారం నీవెకదా
లోకమునకు జీవమొసగు
నిత్య రక్షకా రావయ్యా ||శ్రీ||
2. మా పితరులను మన్నా తినియు
మరణంబును చవిచూచిరి
నీ విందులో పాల్గొని మేము
నిత్యజీవ మొందెదము ||శ్రీ||
3. నీయందున విశ్వాసముతో
నిల్చెడివారు ధన్యులుగా
అట్టి వారిన్ అంత్య దినమున
జీవముతో నీవు లేపుదువు ||శ్రీ||