Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: శ్రీ యేసు విందును లోకానరండి -
ప్రభు క్రీస్తునందున జీవించండి
నిత్య జీవ ఫలముల భోజ్యం -
నమ్మిలోకొంటే రక్షణ భాగ్యం
అ.ప ఇది నిత్యజీవ విందు -
ఇది ప్రభుని పరమ విందు
ఇది కల్వరి బలి విందు -
ఇది కలుషహరణ విందు ||2||
1. గోధుమ రొట్టెలో దేహముగా ద్రాక్ష రసములో రక్తముగా ||2||
వచ్చెను ప్రభువు మన ఆహారమై -
మన ఆత్మలకు జీవాహారమై ||ఇది||
2. క్రీస్తే మనలో మమేకమై మనమంతా ప్రభు దేహమై||2||
సమతా మమతల ప్రభువు సంఘమై -
జీవించెదము ప్రభు సాక్షులమై. ||ఇది||