Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: స్వాగతమో దేవా
ప. శృతిచేసి నే పాడనా స్తోత్రగీతం
భజియించి నే పొగడనా స్వామి
అల్లెలూయ - అల్లెలూయ
అల్లెలూయ - అల్లెలూయ ||2|| ||శృ||
1. దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవే కదా
జల ప్రళయములో నోవాను కాచిన
బలవంతుడవు నీవే కదా! ||2||
నీవే కదా! ||3|| అల్లెలూయ||4|| ||శృ||
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సచ్చరితుడవు నీవేకదా
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన
కరుణామయుడవు నీవేకదా!
నీవెకదా! ||3|| అల్లెలూయ||4|| ||శృ||