Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సృష్టికే మూలమైన వాక్కు
సృష్టికరునికే ప్రేమవాక్కు ||2||
వీనులారా వినరండి ఆ వాక్కును
దీనులారా కనరండి దైవమహిమను స్పష్టం
1. భూమ్యాకాశము కలిగించి
రాత్రిని పగటిని వేరుపరచి ||2||
సూర్య చంద్రాదులను సృష్టించి
శూన్యమునే ఛేదించిన శుభవాక్కు ||2||
||వీనులారా|| ||సృష్టికే||
2. జల ప్రాణులకు ప్రాణములొసగి
సకల వృక్షములను మొలిపించి ||2||
సకల జనావళికి జీవము నిచ్చి
సమస్తమునే సృష్టించిన వాక్కు ||2||
||వీనులారా|| ||సృష్టికే||