Type Here to Get Search Results !

సువిశేష వాక్యం వినరండి ( suvishesa vakyam vinarandi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సువిశేష వాక్యం వినరండి. 

ప్రభు క్రీస్తు నాధుని వేడండి ||2||

ఆ ప్రభు వాక్కును ఆలింపరండి

ప్రభు ఘనకీర్తిని చాటండి ||2||

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 


1. జీవమునిచ్చెడి జేసుని వాక్యం

కాంతిన నింపెడి కమనీయవాక్యం 

ఆత్మలు నింపెడి అమృత వాక్యం 

అభయము నిచ్చెడి ఆత్మీయ వాక్యం 

ఆలకించి అనుసరించి 

పరలోక భాగ్యము పొందండి ||2|| llహల్లెలూయా ll 


2. మార్గము చూపెడి మహిమల వాక్యం

మమతలు పంచెడి మాధుర్య వాక్యం 

సుధలను చిందించు శూనృత వాక్యం 

సత్యము బోధించు సుమధుర వాక్యం 

విశ్వసించి వెంబడించి 

విభుడగు క్రీస్తుని చేరండి ||2|| llహల్లెలూయా ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section