Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
స్తోత్రం స్తోత్రమని కీర్తన పాడెదము
హల్లెలూయా అల్లెలూయని నిను కొనియాడెదము
ఉల్లసించెదమయ్య నీ సన్నిధిని,
సన్నుతింతుము నిన్నే రారాజువని
1. స్వస్థపరచు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము
తృప్తిపరచగలిగిన రారాజువని నిను కొనియాడెదము
ఉల్లసించెదమయ్య నీ సన్నిధిని సన్నుతింతుము నిన్నే రారాజువని ||స్తో॥
2. శక్తినీయు దేవుడవు నీ వేయని కీర్తన పాడెదము
గొప్ప చేయగలిగిన రారాజువని నిను కొనియాడెదము
ఉల్లసించెదమయ్య నీ సన్నిధిని సన్నుతింతుము నిన్నే రారాజువని ||స్తో॥
3. ఉద్దరించు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము
ఆదరించ గలిగిన రారాజువని నిను కొనియాడెదము
ఉల్లసించెదమయ్య నీ సన్నిధిని సన్నుతింతుము నిన్నే రారాజువని ||స్తో॥