Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణా మయుని శరణు తరుణోదయం
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనవి
1. దివి రాజుగా భువికి దిగి నాడని
రవిరాజుగా ఇలను మిగిలాడని
పరలోక భవనాలు తెరిచాడని ||2||
పరలోక గగనాలు పిలిచాడని
ఆరని జీవన జ్యోతిగా వెలిగే
తారొకటొచ్చింది
పాడే పాటల పశువుల శాలలో
ఊయల ఊపింది
ఆ జన్మయే ఒక బంధము
ఆ బంధమే అనుబంధము ||2|| ||సు||
2 లోకాలలో పాపలోకాలలో ఏకాకిలా
బ్రతుకు అవి వేకులా
క్షమ హృదయ సహనాలు సమూహంగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయేసు
నిత్యసుఖాలు జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే
మమ్ము కాయగా నిరు పేదగా
జన్మించెగా యిలపండుగా ||2|| ||సు||