Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సువార్తను బోధించు వారి పాదములు అందమైనవి
ప్రతి నిత్యం ధ్యానించు వారి హృదయములు ధన్యమైనవి
జీవితాంతం యేసు బాటలో నడచుటే పుణ్యం
ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం - అల్లెలూయా... అల్లెలూయా
1. 'తలితాకుమి' అని యాయీరు బిడ్డకు జీవమిచ్చిన వాక్యం
ఎప్పాతా అంటు మూగవానిని నయము చేసిన వాక్యం
శుద్ది పొందుమని కుష్ఠరోగిని బాగుచేసిన వాక్యం
మానవాళికి స్వస్థత నొసగే పరమవైద్యుని వాక్యం
2. సుంకరి లేవీని పిలువగనే యేసుతో నడిచిన వాక్యం
జకరియ గృహమున పాదము మోపగ రక్షణ నిచ్చిన వాక్యం
క్షమను పొందిన మగ్దలేనను ఆదరించిన వాక్యం
త్రోవ తప్పిన మానవాళికి ప్రాణమిచ్చిన వాక్యం