Type Here to Get Search Results !

స్వాగతం-సుమస్వాగతం ( swagatham-sumaswagatham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Rev. Fr. Johnson Chettur 

Tune: Most Rev. Bishop Poola Anthony 

Music: Thyagarajan 

Album: స్వరాభిషేకం 


సా: ఆది మధ్యాంత రహిత - దివ్యతేజో విరాజిత 

కన్య మరియ తనయా కరుణామయా 

పవిత్రాత్మ దేవా పరమేశ్వరా 

నమస్తే నమస్తే

త్రియేక దేవా నమస్తే (నమోస్తుతే) ||2|| 


ప: స్వాగతం సుస్వాగతం

స్వాగతం సుమస్వాగతం 

మనసార మీకు ఘనస్వాగతం. ||2|| 

నవ పీఠాధిపతి అభిషేకం 

ఇది కన్నుల పండుగ అభిషేకం 

ఆర్యులకు అభిమానులకు 

మాన్యులకు మహనీయులకు

ఇదే ఇదే మా ఆహ్వానం ||2|| 


1. అమృత హృదయం వేదికపై

శృతి లయలే మంగళ హారతులై 

స్వరజతులే స్వాగత గీతికలై 

సరిసరాగ రిగరిగాగ సరిగపప 

పనిని నిసస సరిరి

సరిగ సగరిసని పనిస పసనిపగ 

రీగప రిగరిసని నిసపని సరిస ||శృ|| 

మనోజ్ఞ మంగళ కోవెలలో 

ఆత్మతో జరిగే అభిషేకం 

ఇది కన్నుల పండుగ అభిషేకం

నవపీఠాధిపతి అభిషేకం ||ఆ|| 


2. పావన మరియ ఆశీర్వాదం

పరమ పునీతుల దీవెనవర్షం ||2|| 

గుండెల గుడిలో పులకిత హరం ||2|| 

యేసుక్రీస్తు అభయహస్తం 

ఇది మీ భవితకు శ్రీకారం 

మీ జీవితానికిది ప్రాకారం -||ఆ|| 


3. నీవే బలమని నమ్మిన వారిని 

నీ కను నీడలో నడిచేవారిని ||2|| 

పావనాత్మతో అభిషేకించి 

పవిత్రమైన తైలం పూసి 

యాజక వరమును అనుగ్రహించి 

నీ పదసేవలో నిలుపుము దేవా ||ఆ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section