Lyrics: Rev. Fr. Johnson Chettur
Tune: unknown
Music: Sree K Ramachaari
Album: స్వర కమలం
ప: స్వాగతం సుస్వాగతం ఓ యేసు దేవా ||2||
నీ దివ్య రూపం మది కోవెలలో ||2||
నవ సుప్రభాతమై విరిసేను ||2||
వేల వన్నెల పూలతోటి మీకు మాలలల్లేము
చైత్ర వీణల రాగ రమణితో మిమ్ము
స్వాగతించేము సుస్వాగతం శుభస్వాగతం
సుమస్వాగతం ఘనస్వాగతం ||2||
1. సూరీడువై మమ్ము మేలుకొలిపావు - ||2||
జాబిల్లివై మాకు జోల పాడావు ||2||
ఆకలైన వేళలో మా తల్లివైనావు
కన్న తండ్రివై మాకు దారి చూపావు ||2||
ఎరువము స్వామీ ఏ నాటికి మీ మేలు|2||
నీ పాద ధూళియే మాకు పదివేలు ||సు||
2. మా పాటలో రాగాలు నీవే దేవా... ||2||
మా మాటలో భావాలు నీవే కావా ||2|| l
వినే చూసాము నీ నవ్వుల వెన్నెలలో ||2||
భువినే మరిచాము.
నీ మమతల కోవెలలో ... ||2||
విడువకు దేవా మా చెయ్యి :ఏనాడు ||2||
పాపల్లే చేరాము నీ ఒడిలో ఈనాడు ||సు||