Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: కాపరి స్వరం
ప. వచ్చితిదేవా నీ కర్పించ
అర్హత లేకయే నీ దరి చేరితి ||2||
తెచ్చితి దేవా నా హృది అర్పణ
చేకొను స్వామి ఈ చిరుకానుక ||2|| ||వ||
1. మా దేవుడవు నీవని తెలిసి
మా హృది నేతవు నీవని తలచి ||2||
మదిలో నిన్నే కొలిచెదమయ్యా ||2||
సన్నిధి నిలిపి బ్రోవుము దేవా ||2|| ||వ||
2. సృష్టిని చేసిన దేవుడ నీవు
సర్వము నీకే అంకితమయ్యా ||2||
మా జీవమును మార్గము నీవే ||2||
ప్రణమిల్లేదము కృపతో కావుమా ||2|| ||వ||