Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. వచ్చిందమ్మ వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చిందమ్మ తెచ్చింది
దివ్యకాంతి తెచ్చింది
బాలుని చేరెదం ప్రణతులు చేసెదం
గ్లోరి గ్లోరి గ్లోరి గ్లోరి గ్లోరీ టు ద లార్డ్
అల్లెలూ..అల్లెలూ..అల్లెలూ...అల్లెలూ
అల్లెలూ యని పాడెదం ||వచ్చి||
1. గగనము దూతలు గళమెత్తి పాడిరి
ఆనంద హృదయముతో గీతాలు పాడరే
రారండి చేరండి బాలుని చేరండి
పాడండి పాడండి జోలలు పాడండి ||వచ్చి||
2. ఆదిలో వాక్కు ఉండెను
అది దైవ చెంతనుండెను
మనమధ్య మనిషిరూపుడై
మహిమతో అవతరించెను
రారాజు ఉదయించెన్ పశువుల పాకలో
ప్రణుతించి స్తుతియింతు పావన బాలుని ||వచ్చి||