Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వేకువకై వేచియున్న కావలి వలే -
వేచియున్నది నా ఆత్మ నీ కోసమే
ఎప్పుడు నీ మోమును దర్శింతును -
ఎప్పుడు నీ సన్నిధి చేరగలనయ్యా
యేసయ్యా... యేసయ్యా
1. పడిపోయిన వారు లేవలేరా -
పాపులు కూడా పునీతులవ్వరా
నీ నీడలో నేనుండిన చాలును దేవా
యేసయ్యా... యేసయ్యా....
2. లోకమంతా పాపమయమయ్య -
పడిపోతానే అని భయమేస్తుంది
నా చెయ్యిపట్టి నడిపించ రావయ్యా
యేసయ్యా... యేసయ్యా..