Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-14
ప. వెళ్ళుచున్న చోట నీవు తెలుసుకున్నావా
పరిగెత్తే లోకంతో నీవు పరుగిడుతున్నావా ||2||
ఒక నిమిషం ఆగు నీ హృదినీ నీవు చూడు
తెలుసుకో నీ గమ్యం ఎన్నుకో నీ జీవం ||2||
1. ఈ లోకం దాని వ్యామోహము
నీ ముందే గతియించి పోతుంది ||2||
ప్రభుని నమ్మిన వారు
నూతన బలము పొంది
చిరకాలము జీవింతురు
మరణమా జీవమా ఎన్నుకో
2. లోక ప్రేమను వెదకి
నశించిన వారెందరో
మనుషుల స్నేహం
వెదకి మరణించిన వారెందరో
ఒక నిమిషం ఆగు నీవు వెదకుచున్నది ఏమో
తెలుసుకో నీ హృదిని ఎన్నుకో నీ మార్గం
నీ సంపదలున్న చోటనే
నీ హృదయం ఉండును
ఎటువంటి సంపదను నీవు వెదకుచున్నావో
గమనించుకో నీవు జీవింతువు
లోకమా దైవమా ఎన్నుకో ||2||