Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వెన్నెల పండు వెన్నెల ||2||
యేసుతో ..... ఊసులాడవే
పసిడి వర్ణపు చాయతో కొలువయివున్న యేసుతో ||2||
ఊసులాడవే ||2||
ఓ వెన్నెల ఊసులాడవే
వర్షమా మంచు వర్షమా ll ll 2 ll
యేసుకే పన్నీరు చల్లవే రాజుల నేలే రారాజే
భువికేతెంచెను ఈ రోజే
పన్నీరు చల్లవే ||2||
ఓ వర్షమా పన్నీరు చల్లవే
మేఘమా నీలిమేఘమా ||2||
యేసుకు పాన్పుకావవే ఘనత మహిమ
కీర్తియు స్తుతులు కలిగిన యేసుకే
పాన్పు కావవే ||2||
ఓ మేఘమా పాన్పు కావవే
కోయిల కుకు కోయిల ||2||
యేసుకే జోల పాడవే ... జోలపాడవే
ముద్దులొలికే మోమునే చరితను మార్చే రాజుకే
జోలపాడవే ||2||
ఓ కోయిల జోలపాడవే