Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. వనమేగి. రాత్రియందు
విలపించే యేసువు
తన రక్తంబు చెమర్చే
తమ తండ్రిన్ వేడుచు
మన పాపాలెల్ల నోర్వ
మనుజుండై పుట్టెను
వినుమెంతో బాధనొంది
విలపించి రయ్యయ్యో
1. వెలకమ్మైన్ జూదా యేసున్
వినయంబున్ ముద్దిడి
ఇలనెందున్ గానలేము
ఇంత ఘోర ద్రోహము ||మ||
2. తల పై కిరీటమపుడు
తగు ముండ్ల నల్లియు
బలు దుష్టులు పెట్టయేసు
బహు దుఃఖంబొందెను ||మ||
3. వరదైన రక్తం పార-వడి యేసున్ గొట్టిరి
తిరు దేహంబంత జీలెన్
ధరమూర్చ పోయెను ||మ||
4. బహు భారమైన స్లీవ
భుజమెంతో నొవ్వగా
మహిలో మోపించినారు
మరియా కొమరునిన్ ||మ||
5. మరి కొట్టగాను స్లీవన్
మరణంబు పొందిరి
కూృర జూదో వంశమిట్లు
ఘనునిన్ చంపించిరి ||మ||